ఐలమ్మ సాహసం యువతకు ఆదర్శం
eenadu telugu news
Published : 27/09/2021 02:10 IST

ఐలమ్మ సాహసం యువతకు ఆదర్శం


నివాళులు అర్పిస్తున్న జిల్లా అదనపు పాలానాధికారి మోతీలాల్‌, ప్రజాప్రతినిధులు

వికారాబాద్‌ కలెక్టరేట్‌, న్యూస్‌టుడే: తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ అని జిల్లా అదనపు పాలనాధికారి మోతీలాల్‌ అన్నారు. ఆదివారం ఐలమ్మ జయంతిని జిల్లా వెనుకబడిన తరగతులు అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. భూమి, భుక్తి, దోపిడీదారుల విముక్తికి ఆమె పోరాటం చేశారని పేర్కొన్నారు. ఆనాటి దొరల గడీలను గడగడ లాడించిన వీరనారి అని కొనియాడారు. ఆమె సాహసాన్ని యువత ఆదర్శంగా తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో బీసీ కమిషన్‌ సభ్యుడు శుభప్రద్‌ పటేల్‌, టీఎస్‌ఈడబ్ల్యూఐడీసీ ఛైర్మన్‌ నాగేందర్‌గౌడ్‌, పురపాలక సంఘం అధ్యక్షురాలు మంజుల, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ మురళీకృష్ణ, బీసీ సంక్షేమ శాఖాధికారిణి పుష్పలత, గిరిజన సంక్షేమాధికారి కోటాజీ, రజక సంఘాల నాయకులు పాల్గొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని