నీరు పోవట్లే.. ప్రాణాలే పోతున్నాయ్‌
eenadu telugu news
Updated : 27/09/2021 11:45 IST

నీరు పోవట్లే.. ప్రాణాలే పోతున్నాయ్‌

నగరంలో రహదారుల వెంట ప్రమాదకరంగా ఉన్న నాలాలు, తెరిచి ఉన్న మ్యాన్‌హోళ్లు ప్రజల ప్రాణాలు తీస్తున్నాయి. వర్షం వచ్చిన సమయంలో నీరు భారీగా ప్రవహిస్తుండడంతో అవి కనిపించక అటుగా వెళ్లిన వారు పడిపోతున్నారు. శనివారం రాత్రి మణికొండలో ఓ వ్యక్తి ఇలానే గల్లంతయ్యాడు. ఏటా వర్షాకాలంలో ఈ తరహా ఘటనలు జరిగి ఎన్నో కుటుంబాలకు విషాదం మిగుల్చుతున్నా యంత్రాంగం మాత్రం మేల్కోవడం లేదు.


ఉస్మాన్‌గంజ్‌ నుంచి గౌలిగూడ వెళ్లే నాలా ఇది. నివాసాల మధ్య ఉద్ధృతంగా ప్రవహిస్తూ స్థానికులకు వణుకు పుట్టిస్తోంది. గతంలో చాలా మంది పడిపోయారు. మరో కుటుంబానికి రోదన మిగల్చకముందే స్పందించాలి.


చింతల్‌కుంట చెక్‌పోస్టు నుంచి సాగర్‌ రింగురోడ్డు వెళ్లే మార్గంలో గుంటి జంగయ్యనగర్‌ వద్ద వరద కాలువ పనులు మూడు నెలలుగా మందకొడిగా సాగుతున్నాయి. వర్షం పడినప్పుడు మట్టి జారితే ప్రాణం దక్కడం కష్టమే..


నాచారంలో కాలువ ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. వర్షం పడిన సమయంలో వరద ప్రవాహం మరింత పెరుగుతుంది. రక్షణ గోడ లేక గతంలో ప్రమాదాలు జరిగాయి. సమీపంలోనే పాఠశాల ఉంది.


గచ్చిబౌలి జనార్దనాహిల్స్‌ రోడ్‌ నంబర్‌ 1 నుంచి నాసర్‌ పాఠశాలకు వెళ్లే మార్గంలో రూ.1.7 కోట్లతో చేపట్టిన కాలువ పనులు స్థల వివాదంతో ఆగిపోయాయి. ఇక్కడ కల్వర్టు కిందికి ఉండడంతో వరద వస్తే వాహనదారులకు ప్రమాదమే.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని