నయన మనోహరం.. ‘అక్షర’ అరంగేట్రం
eenadu telugu news
Published : 27/09/2021 03:24 IST

నయన మనోహరం.. ‘అక్షర’ అరంగేట్రం

రవీంద్రభారతి, న్యూస్‌టుడే: తొలకరిజల్లుకు పురివిప్పి నెమలి ఆడినట్లుగా.. చిన్నారి నర్తకి అక్షర హరిణి గండే భరతనాట్యంలో వివిధ అంశాల్లో హుషారుగా అడుగులు వేసి ప్రేక్షకులను మెప్పించింది. నృత్యారాధన డ్యాన్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ వ్యవస్థాపకురాలు నాట్యగురువు షర్మిల గుప్తా శిష్యురాలైన పన్నెండేళ్ల చిన్నారి ఆదివారం రాత్రి రవీంద్రభారతి ప్రధాన మందిరంలో తొలి అడుగులు వేసి అందరి దృష్టిని ఆకర్షించింది. ఉత్తుకడు సుబ్రమణ్య అయ్యర్‌ నాట్ట రాగం, ఆదితాళంలో ‘ఆనంద నర్తన గణపతిం’ అంశంతో ప్రదర్శనకు శుభారంభం పలికింది. ‘భరతకుల భాగ్యకలికే’... కల్యాణి రాగం, ఆదితాళంలో కూర్చిన వర్ణం అంశంలో ‘ఆదుం దైవం’ చక్కగా అభినయించింది. అనంతరం జరిగిన అభినందన సభకు రాష్ట్ర మంత్రి జి.జగదీష్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై చిన్నారిని అభినందించారు. రాష్ట్ర ప్రభుత్వం సలహాదారు డా.కె.వి.రమణాచారి అధ్యక్షోపన్యాసం చేశారు. ఉపాధ్యాయ్‌ స్కూల్‌ ఆఫ్‌ డాన్స్‌ డైరెక్టర్‌ గురు పార్శ్వనాథ్‌ ఉపాధ్యాయ్‌ అభినందించారు. అనంతరం అక్షర తన గురువును సత్కరించింది. నిర్వాహకులు ఉషారాణి, శ్రీనివాస్‌ గండేలు పర్యవేక్షించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని