అసమాన పోరాటానికి ప్రతీక ఐలమ్మ
eenadu telugu news
Published : 27/09/2021 03:24 IST

అసమాన పోరాటానికి ప్రతీక ఐలమ్మ

ఐలమ్మ విగ్రహం ముందు కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి, డా.లక్ష్మణ్‌, డా.అంజయ్య తదితరులు

కవాడిగూడ, కార్ఖానా - న్యూస్‌టుడే: నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా సామాన్యులు సాగించిన అసమాన పోరాటాలకు చాకలి ఐలమ్మ నిదర్శనమని కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి అన్నారు. ఆదివారం ట్యాంక్‌బండ్‌ దిగువన, నగరంలోని భాజపా రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన చాకలి ఐలమ్మ జయంతి కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. భాజపా ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డా.లక్ష్మణ్‌, భాజపా మహంకాళి జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు శ్యాంసుందర్‌గౌడ్‌, మేకల సారంగపాణి, సీకే శంకర్‌రావు, కార్పొరేటర్‌ రచనశ్రీ, ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు ఆలె భాస్కర్‌, బండా కార్తీకరెడ్డి, శ్యాంసుందర్‌గౌడ్‌ పాల్గొన్నారు.

ట్యాంక్‌బండ్‌పై నివాళి అర్పిస్తున్న మంత్రులు మల్లారెడ్డి, శ్రీనివాస్‌గౌడ్‌, ఎమ్మెల్యే సాయన్న తదితరులు

* రజాకర్ల పాలనను ఎదురించిన వీర వనితగా చాకలి ఐలమ్మ చరిత్రలో నిలిచిపోయారని రాష్ట్ర మంత్రులు తలసాని, మల్లారెడ్డి, శ్రీనివాస్‌గౌడ్‌ పేర్కొన్నారు. మడ్‌ఫోర్డ్‌ దోభీ ఘాట్‌లో చాకలి ఐలమ్మ జయంతి వేడుకలను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించింది. స్థానిక ఎమ్మెల్యే సాయన్నతో కలసి మంత్రులు హాజరయ్యారు. వెనకబడిన తరగతుల ప్రిన్సిపల్‌ సెక్రటరీ బుర్ర వెంకటేశ్వర్లు, వాషర్‌మెన్‌ ఫెడరేషన్‌ ఎండీ చంద్రశేఖర్‌రావు, బోయిన్‌పల్లి మార్కెట్‌ ఛైర్మన్‌ టీఎన్‌.శ్రీనివాస్‌, మోండా మార్కెట్‌ కార్పొరేటర్‌ కొంతం దీపిక, బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జంపన ప్రతాప్‌, మహేశ్వర్‌రెడ్డి, కేశవరెడ్డి, ప్రభాకర్‌, లోక్‌నాథ్‌, నేతలు గజ్జెల నాగేష్‌, శ్రీగణేష్‌, ఆకుల నాగేష్‌, రజక సంఘం అధ్యక్షుడు ఎల్‌.శంకర్‌, ప్రతినిధులు కృష్ణ, ఎల్లయ్య, సత్యనారాయణ, శ్రీరామకృష్ణ, ఎల్‌.సురేష్‌, ఎం.ఉప్పలయ్య, లావణ్య, రాజు పాల్గొన్నారు.

ఐలమ్మ చిత్రపటం వద్ద మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌, ఎమ్మెల్యే ముఠా గోపాల్‌, హైదరాబాద్‌జిల్లా కలెక్టర్‌ శర్మణ్‌

* భూమి కోసం, భుక్తి కోసం పోరాడిన వీరవనిత చాకలి ఐలమ్మ అని రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ అన్నారు. ముషీరాబాద్‌ శాసనసభ్యుడు ముఠా గోపాల్‌ మాట్లాడుతూ ట్యాంక్‌బండ్‌ దిగువన ఐలమ్మ విగ్రహం పరిసరాలను సుందరంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానన్నారు.

* రజక అభివృద్ధి సంస్థ జాతీయ అధ్యక్షుడు డా.అంజయ్య, గ్రేటర్‌ అధ్యక్షుడు నర్సింహా, కార్యదర్శులు చంద్రమోహన్‌, రాజశేఖర్‌ తదితరులు నివాళులర్పించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని