పాఠ్యపుస్తకంలో ఉగ్రవాద చిత్రంపై వివాదం
eenadu telugu news
Published : 27/09/2021 03:37 IST

పాఠ్యపుస్తకంలో ఉగ్రవాద చిత్రంపై వివాదం

పహాడీషరీఫ్‌, న్యూస్‌టుడే: ఒక చేతిలో పవిత్ర గ్రంథం ఖురాన్‌.. మరో చేతిలో తుపాకీ పట్టుకుని ఇస్లాం మతం ఉగ్రవాదానికి ప్రతీక అనే తరహాలో రియల్‌ పబ్లిషర్స్‌ అనే సంస్థ ఎనిమిదో తరగతి పాఠ్యపుస్తకంలో చిత్రాన్ని ముద్రించడంపై వివాదం నెలకొంది. గత రెండు రోజులుగా వాట్సప్‌, ఫేస్‌బుక్‌లో ఈ విషయం వైరల్‌ అవుతోంది. దీంతో జల్‌పల్లి పురపాలిక కో ఆప్షన్‌ సభ్యుడు సూరెడ్డి కృష్ణారెడ్డి, తెరాస మైనార్టీ నేతలు సయ్యద్‌ అబ్దుల్‌ రవూఫ్‌, సయ్యద్‌ మన్నన్‌ ఆదివారం మంత్రి సబితారెడ్డిని కలిసి పరిస్థితిని వివరించారు. ఎనిమిదో తరగతి ఇంగ్లిష్‌ మీడియం సోషల్‌ పుస్తకంలో రియల్‌ పబ్లిషర్స్‌ సంస్థ ముద్రించిన చిత్రంతో.. ఇస్లాం మతం హింసను ప్రేరేపిస్తుందనే చెడు సంకేతం ఇచ్చినట్లవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై వెంటనే స్పందించిన మంత్రి సబితారెడ్ఢి. విద్యాశాఖ, పోలీసు ఉన్నతాధికారులతో ఫోన్‌లో మాట్లాడారు. ఆమె ఆదేశాల మేరకు.. సంబంధిత చిత్రాన్ని ప్రచురించిన సంస్థపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసు అధికారులు అనంతరం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని