Crime News: సనత్‌నగర్‌లో దారుణం.. నవవధువు గొంతునులిమి చంపిన భర్త
eenadu telugu news
Published : 27/09/2021 13:31 IST

Crime News: సనత్‌నగర్‌లో దారుణం.. నవవధువు గొంతునులిమి చంపిన భర్త

హైదరాబాద్‌: నగరంలోని సనత్‌నగర్‌ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. సనత్‌నగర్‌ పరిధిలోని భరత్‌నగర్‌లో నవ వధువు హత్యకు గురైంది. భర్త గంగాధర్‌ భార్య గొంతు నులిమి చంపేశాడు. నిన్న అర్ధరాత్రి సమయంలో భార్యభర్తల మధ్య ఘర్షణ జరిగింది. దీంతో కోపాద్రిక్తుడైన గంగాధర్‌.. మానసను గొంతు నులిమి హత్య చేశాడు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని