Crime News: మణికొండలో గల్లంతైన సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ మృతదేహం లభ్యం
eenadu telugu news
Published : 28/09/2021 01:33 IST

Crime News: మణికొండలో గల్లంతైన సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ మృతదేహం లభ్యం

హైదరాబాద్: నగరంలో ఈనెల 25న రాత్రి కురిసిన వర్షానికి మణికొండలోని డ్రైనేజీలో గల్లంతైన సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ రజనీకాంత్‌ మృతదేహం లభ్యమైంది. నెక్నాంపూర్‌ చెరువులో రజనీకాంత్ మృతదేహం లభ్యమైంది. సమచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. నాలాలు కలిసే చోట, నెక్నాంపూర్‌ చెరువు వద్ద గాలింపులో భాగంగా నెక్నాంపూర్‌ చెరువులో గుర్రపు డెక్క తొలగిస్తుండగా రజనీకాంత్‌ మృతదేహం బయటపడింది. రెండు రోజుల క్రితం పెరుగు ప్యాకెట్‌ కోసం వచ్చి మణికొండ డ్రైనేజీలో గల్లంతైన రజనీకాంత్‌ మృతదేహం దాదాపు మూడు కిలోమీటర్ల దూరం కొట్టుకొచ్చింది. గోపిశెట్టి రజనీకాంత్‌ (42) షాద్‌నగర్‌లోని నోవా గ్రీన్‌ కంపెనీలో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా పనిచేస్తున్నారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని