రూ.17 కోట్లతో ఉడాయించిన వ్యక్తి అరెస్టు
eenadu telugu news
Published : 27/09/2021 19:28 IST

రూ.17 కోట్లతో ఉడాయించిన వ్యక్తి అరెస్టు

హైదరాబాద్‌: స్టాక్‌ మార్కెట్‌ పేరుతో అధిక వడ్డీ ఇస్తానంటూ ఓ వ్యక్తి భారీ మోసానికి పాల్పడ్డాడు. పలువురు నుంచి రూ.17 కోట్లు వసూలు చేసి ఉడాయించాడు. బాధితుడు రవిశంకర్‌ ఫిర్యాదుతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. శ్రీహర్ష అనే వ్యక్తి గతంలో యూఏఈలోని అబుదాబి యాక్సిస్‌ బ్యాంకులో పనిచేసేవాడు. స్టాక్‌ మార్కెట్ పేరుతో అధిక వడ్డీ ఆశ చూపి పలువురి దగ్గర భారీగా నగదు వసూలు చేసి పరారయ్యాడు. 2019 సెప్టెంబరు నుంచి శ్రీహర్ష తప్పించుకునే తిరుగుతున్నాడు. తాజాగా పంజాబ్‌లో శ్రీహర్షను సైబర్‌ క్రైమ్‌ పోలీసులు అరెస్టు చేశారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని