కోర్టు తీర్పు ఆధారంగానే నియామకాలు చేపడతాం: సబితా
eenadu telugu news
Published : 27/09/2021 20:59 IST

కోర్టు తీర్పు ఆధారంగానే నియామకాలు చేపడతాం: సబితా

హైదరాబాద్: తెలంగాణలోని ఎయిడెడ్‌ విద్యాసంస్థలలో కారుణ్య నియామకాల విషయంలో కోర్టు తీర్పు ఆధారంగా నిర్ణయం తీసుకుంటామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి వెల్లడించారు. 1991 నుంచి ఎయిడెడ్‌ విద్యాసంస్థల్లో కారుణ్య నియామకాలను నిలిపివేస్తూ నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించి కోర్టులో కేసు నడుస్తోందని.. న్యాయస్థానం తీర్పు ఆధారంగానే నిర్ణయం ఉంటుందని మంత్రి తెలిపారు. రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటైన అనేక గ్రామపంచాయతీల్లో అంగన్‌ వాడీ కేంద్రాల ఏర్పాటుకు తగిన ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్లు మండలిలో స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌ వివరించారు. రాష్ట్రంలో 35,573 అంగన్‌వాడీ కేంద్రాలు పని చేస్తున్నాయని... ఇప్పటికే అంగన్వాడీ టీచర్ల వేతనాలు పెంచామని, మినీ అంగన్వాడీ టీచర్ల వేతనాలు పెంచేందుకు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లనున్నట్లు వివరించారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని