Ts News: గులాబ్‌ ఎఫెక్ట్‌.. అంబేడ్కర్‌ ఓపెన్‌ వర్సిటీ పరీక్షలు వాయిదా
eenadu telugu news
Published : 27/09/2021 21:48 IST

Ts News: గులాబ్‌ ఎఫెక్ట్‌.. అంబేడ్కర్‌ ఓపెన్‌ వర్సిటీ పరీక్షలు వాయిదా

హైదరాబాద్: డా.బి.ఆర్. అంబేడ్కర్ ఓపెన్ యునివర్సిటీ పరిధిలో సెప్టెంబర్ 28, 29న జరగాల్సిన అన్ని పరీక్షలు వాయిదా వేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాల కారణంగా ఈ రెండు రోజుల్లో జరగాల్సిన పరీక్షలను వాయిదా వేసినట్లు అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. మిగతా తేదీల్లో నిర్వహించాల్సిన పరీక్షల్లో మాత్రం ఎలాంటి మార్పు లేదన్నారు. వాయిదా పడిన పరీక్షల తేదీలను తర్వాత ప్రకటిస్తామని తెలిపారు. వివరాలకు యూనివర్సిటీ వెబ్‌సైట్ చూడాలని, స్టడీ సెంటర్లలో సంప్రదించాలని సూచించారు. పూర్తి వివరాలు www.braouonline.inలో పొందొచ్చని పేర్కొన్నారు.

పీఈ సెట్‌ పరీక్ష అక్టోబర్‌ 23కి వాయిదా

ఈ నెల 30న జరగాల్సిన పీఈ సెట్‌ వాయిదా పడింది. వర్షాల వల్ల పీఈ సెట్‌ శారీరక ధారుడ్య పరీక్షలు వాయిదా వేస్తున్నట్టు కన్వీనర్‌ వెల్లడించారు. ఈ పరీక్షలు అక్టోబర్‌ 23కు వాయిదా వేస్తున్నట్టు తెలిపారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని