Ts News: దోస్త్‌.. మూడో విడత సీట్ల కేటాయింపు పూర్తి
eenadu telugu news
Published : 27/09/2021 23:03 IST

Ts News: దోస్త్‌.. మూడో విడత సీట్ల కేటాయింపు పూర్తి

హైదరాబాద్: దోస్త్‌ మూడో విడత సీట్ల కేటాయింపు ప్రక్రియ పూర్తయింది. మూడో విడతలో 73,637 మందికి డిగ్రీ సీట్లు కేటాయించారు. మూడో విడతలో 80,336 మందికి వెబ్ ఆప్షన్లు ఇవ్వగా.. అందులో 55,026 మందికి మొదట కోరుకున్న సీటే దక్కింది. మరో 6,699 మంది వెబ్ ఆప్షన్లు నమోదు చేసినప్పటికీ.. సీటు దక్కలేదు. కొత్తగా ప్రవేశపెట్టిన బీఏ ఆనర్స్ కోర్సులో 120 మందికి సీట్లు కేటాయించినట్లు దోస్త్ కన్వీనర్ ప్రొఫెసర్ లింబాద్రి తెలిపారు. సీటు వచ్చిన అభ్యర్థులు అక్టోబరు 4 వరకు సెల్ఫ్ రిపోర్టింగ్ చేసి.. కళాశాలల్లో చేరాలని పేర్కొన్నారు. అదే కాలేజీలో కోర్సు మార్చుకునేందుకు అక్టోబరు 5 నుంచి 7 వరకు ఇంట్రా కాలేజీ వెబ్ ఆప్షన్లకు అవకాశం ఉంటుందన్నారు. అక్టోబరు 8న ఇంట్రా కాలేజీ సీట్లను కేటాయిస్తారు. అక్టోబరు 1 నుంచి డిగ్రీ మొదటి సెమిస్టర్ తరగతులు ప్రారంభమవుతాయని లింబాద్రి వివరించారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని