పొదలతో.. పొంచి ఉన్న ప్రమాదం
eenadu telugu news
Published : 28/09/2021 02:08 IST

పొదలతో.. పొంచి ఉన్న ప్రమాదం

కుల్కచర్ల గ్రామీణ: రోడ్డుకు ఇరువైపులా పెరిగిన పిచ్చి మొక్కలను తొలగించాలని చాకల్‌పల్లితండా ప్రజలు కోరుతున్నారు. మొక్కలు పెరిగిపోయి కొన్ని చోట్ల రోడ్డుంతా ఇరుకుగా మారిందన్నారు. దీంతో వాహనాల రాకపోకలకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయని చెబుతున్నారు. పిచ్చి మొక్కలను తొలగించి రోడ్డుకు ఇరువైపులా మట్టిని పోయించి విస్తీర్ణం పెంచేలా చూడాలన్నారు. సమస్య చాలా రోజులుగా ఉన్నా ఎవరూ.. పట్టించుకోవడం లేదని తండా వాసులు పేర్కొంటున్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని