నినాదాల హోరు.. నిరసనల జోరు
eenadu telugu news
Published : 28/09/2021 02:08 IST

నినాదాల హోరు.. నిరసనల జోరు


పరిగిలో నిరసన వ్యక్తం చేస్తున్న అఖిలపక్షం

కాంగ్రెస్‌, వామపక్షాలు తలపెట్టిన భారత్‌ బంద్‌ జిల్లాలోని అన్ని మండల కేంద్రాల్లో నిర్వహించారు. వ్యాపార సముదాయాలు, విద్యాసంస్థలను మూయించారు. మధ్యాహ్నం వరకు బస్సుల్ని తిరగకుండా అడ్డుకున్నారు. పార్టీల నాయకులు, కార్యకర్తలు రోడ్లపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. కేంద్ర సర్కారు చేసిన చట్టాలకు వ్యతిరేకంగా నినదించారు.


కొడంగల్‌లో...

కొడంగల్‌: కాంగ్రెస్‌, సీపీఐ, సీపీఎంలతో పాటు ఇతర పార్టీలకు చెందిన నాయకులు ర్యాలీగా వెళ్లి దుకాణాలను మూయించి వేశారు. అనంతరం అంబేడ్కర్‌ కూడలి వరకు ర్యాలీగా వచ్చి ధర్నా, రాస్తారోకో నిర్వహించారు.

దోమ: దోమ, దాదాపూర్‌, బుద్లాపూర్‌, మోత్కూర్‌ తదితర గ్రామాల్లో కాంగ్రెస్‌ కార్యకర్తలు రోడ్లపైకి వచ్చి నిరసన తెలిపారు. పార్టీ మండల అధ్యక్షుడు విజయ్‌కుమార్‌రెడ్డి పాల్గొన్నారు.

బొంరాస్‌పేట: కాంగ్రెస్‌పార్టీ నాయకులు తుంకిమెట్లలో జాతీయ రహదారిపై వర్షంలోనే నిలబడి నిరసన తెలిపారు.

పెద్దేముల్‌: మండల కేంద్రంలోని పాఠశాల, కళాశాల తరగతులను బహిష్కరించారు. కార్యక్రమంలో మండల పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు ప్రవీణ్‌కుమార్‌ పాల్గొన్నారు.

మర్పల్లి: దుకాణా సముదాయాలను మూసివేయించి రోడ్డుపై భైయిఠాయించి ధర్నా చేశారు. కాంగ్రెస్‌, తెదేపా అధ్యక్షులు రవీందర్‌, దివాకర్‌ మాట్లాడారు.

ధారూర్‌: కాంగ్రెస్‌ పార్టీ మండల అధ్యక్షుడు రఘువీరారెడ్డి ఆధ్వర్యంలో దుకాణాలను మూయించారు. అనంతరం రస్తారోకో చెపట్టారు.

యాలాల: లక్ష్మీనారాయణపూర్‌ చౌరస్తాలో తాండూరు, కొడంగల్‌ ప్రధాన రహదారిపై నిరసన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో యాలాల మండల పార్టీ కాంగ్రెస్‌ అధ్యక్షులు భీమయ్య, సీపీఎం మండల పార్టీ ప్రధాన కార్యదర్శి బుగ్గప్ప తదితరులు పాల్గొన్నారు.

పూడూరు: కాంగ్రెస్‌ పార్టీ మండల అధ్యక్షుడు సురేందర్‌, సీపీఐ మండల కార్యదర్శి బుచ్చన్న మన్నెగూడ రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు. వారిని పోలీసులు అరెస్టుచేసి స్టేషన్‌కు తరలించారు.

తాండూరు: ఆర్టీసీ డిపో నుంచి బస్సులను కొంత సమయం వరకు బస్సులను బయటికి రానీయ లేదు. వ్యాపారులు తమ దుకాణాలను మూసేశారు. బంద్‌ నిర్వహిస్తున్న అఖిల పక్షం నాయకులను పోలీసులు అరెస్టుచేసి స్టేషన్‌కు తరలించారు. వ్యక్తిగత పూచీకత్తుపై విడుదల చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర కాంగ్రెస్‌ పార్టీ ఉపాధ్యక్షుడు రమేశ్‌, పెద్దేముల్‌ జడ్పీటీసీ సభ్యుడు ధారాసింగ్‌, తెజస తాండూరు నియోజకవర్గ ఇన్‌ఛార్జి సోమశేఖర్‌, తాండూరు పట్టణ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు ప్రభాకర్‌గౌడ్‌ ఉన్నారు.

కుల్కచర్ల: డీసీసీ ఉపాధ్యక్షుడు బొలుసని భీంరెడ్డి కుల్కచర్లలో పాల్గొన్నారు. మండల పార్టీల అధ్యక్షుడు ఎల్పటి అశోక్‌ ఉన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని