సహకార సంఘం ద్వారా రూ.10 కోట్ల రుణాలు
eenadu telugu news
Published : 28/09/2021 02:08 IST

సహకార సంఘం ద్వారా రూ.10 కోట్ల రుణాలు


మాట్లాడుతున్న అధ్యక్షుడు రవీందర్‌గౌడ్‌ 

తాండూరుగ్రామీణ, న్యూస్‌టుడే: తాండూరు మండలం ఎల్మకన్నె ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో రైస్‌ మిల్లు, గోదాంల నిర్మాణాలు చేపడతామని అధ్యక్షులు రవీందర్‌గౌడ్‌ వెల్లడించారు. సహకార కార్యాలయం వద్ద సోమవారం నిర్వహించిన సర్వసభ్య సమావేశంలో ఆయన మాట్లాడుతూ..రైతులకు మేలు చేకూర్చేలా రైస్‌ మిల్లు, గోదాంల నిర్మాణానికి అవసరమైన స్థలాలను కేటాయిస్తూ ఉన్నతాధికారులకు తహసీల్దారు నివేదిక పంపారని తెలిపారు. భూకేటాయింపుల ప్రక్రియ పూర్తైన వెంటనే పనులు ప్రారంభిస్తామని పేర్కొన్నారు.తద్వారా సంఘానికి శాశ్వత ఆదాయాన్ని సమకూర్చుతామని వెల్లడించారు. సంఘం ద్వారా రూ.10 కోట్ల బంగారం తాకట్టు రుణాల్ని అందించినట్లు ప్రకటించారు. రుణాల వడ్డీతో ఆదాయం సమకూరుతోందన్నారు. ఖరీఫ్‌ సీజన్‌లో రైతులకు రూ.80లక్షల పంట రుణాలు ఇవ్వగా, మరో రూ.కోటి ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. గృహ, పౌల్ట్రీ, హర్వేస్టర్‌లకు రూ.25లక్షల దాకా రుణాలు అందజేస్తామన్నారు. డైరెక్టర్‌లు సురేందర్‌రెడ్డి, వెంకట్రాంరెడ్డి, సీఈఓలు శ్రీనివాస్‌, చంద్రారెడ్డి, రైతులు పాల్గొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని