ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ పర్యాటకంపై నిర్లక్ష్యం
eenadu telugu news
Published : 28/09/2021 03:39 IST

ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ పర్యాటకంపై నిర్లక్ష్యం

మాదాపూర్‌, న్యూస్‌టుడే: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తెలంగాణ పర్యాటక స్థలాలు నిర్లక్ష్యానికి గురయ్యాయని మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్‌ అన్నారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తరువాత ముఖ్యమంత్రి కేసీఆర్‌ నేతృత్వంలో పర్యాటకాభివృద్ధికి కోసం అనేక చర్యలు చేపట్టినట్లు మంత్రి పేర్కొన్నారు. ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని పురస్కరించుకొని సోమవారం రాత్రి టూర్స్‌ అండ్‌ ట్రావెల్స్‌ ఏజెంట్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ తెలంగాణ ఆధ్వర్యంలో మాదాపూర్‌ ఆవాస హోటల్‌లో సమావేశం ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో సినీనటుడు తనికెళ్ళ భరణి, ఆర్‌వీ టూర్స్‌ అండ్‌ ట్రావెల్స్‌ అధినేత రమణ తదితరులున్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని