HYD Rains: భారీ వర్షాల వేళ.. అత్యవసరమైతే సంప్రదించండి.!
eenadu telugu news
Updated : 28/09/2021 06:59 IST

HYD Rains: భారీ వర్షాల వేళ.. అత్యవసరమైతే సంప్రదించండి.!

ఈనాడు, హైదరాబాద్‌ : భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మంత్రి సబితారెడ్డి సూచించారు. రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్‌లో 24 గంటల ప్రత్యేక కంట్రోల్‌ రూం ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. ప్రజలు 040-23230817నంబరులో సంప్రదించాలన్నారు. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని మేడ్చల్‌ జిల్లా ఇన్‌ఛార్జి కలెక్టర్‌ ఎస్‌.హరీష్‌ సూచించారు. సాయం అవసరమైన ప్రజలు 9492409781 నంబరులో సంప్రదించవచ్చన్నారు.

సైబరాబాద్‌, రాచకొండ పోలీసులు అప్రమత్తం

ఈనాడు, హైదరాబాద్‌, రాయదుర్గం, న్యూస్‌టుడే: భారీ వర్షాల నేపథ్యంలో సైబరాబాద్‌, రాచకొండ పోలీసులు అప్రమత్తమయ్యారు. 24 గంటలు పనిచేసేలా ప్రత్యేకంగా కమాండ్‌ కంట్రోల్‌ రూంను అందుబాటులోకి తెచ్చారు. సైబరాబాద్‌: 94906 17100, 83310 13206, 040-27853413, 040-27853412, రాచకొండ: 9490617111, టోల్‌ఫ్రీ నంబర్‌: 1912


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని