రోడ్లపై తస్మాత్‌ జాగ్రత్త..!
eenadu telugu news
Published : 28/09/2021 03:39 IST

రోడ్లపై తస్మాత్‌ జాగ్రత్త..!


కార్ఖానా వద్ద పొంగుతున్న మ్యాన్‌హోల్‌

ఈనాడు, హైదరాబాద్‌: ఎడతెరిపి లేని వర్షంతో నగరంలోని అనేక ప్రాంతాల్లో రోడ్లపై వరద పారుతోంది. గ్రేటర్‌ వ్యాప్తంగా మూడున్నర లక్షల మ్యాన్‌హోళ్లు ఉన్నాయి. వరద నీరు పోటెత్తడంతో కొన్నిచోట్ల మ్యాన్‌హోళ్ల మూతలు లేచిపోయి రోడ్లపైకి మురుగు పొంగుతోంది. ఇలాంటి చోట్ల ప్రజలు మరింత జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.

* చాలా మంది వరద నీరు పోవడానికని మ్యాన్‌హోల్‌ మూత తెరుస్తుంటారు. ఇది చాలా ప్రమాదకరం. ఎట్టి పరిస్థితిలోనూ ప్రైవేటు వ్యక్తులు వాటిని తెరవద్ధు ఏదైనా ఇబ్బంది ఉంటే 100 లేదా జల మండలి 155313 నెంబరుకు ఫోన్‌ చేసి సమాచారం అందించాలి.

* వరద ఉద్ధృతి ఎక్కువగా ఉంటే మధ్య నుంచి బైక్‌ పోనివ్వడం, నడుచుకుంటూ వెళ్లవద్ధు బస్సులు, ఆటోల వెనుక ద్విచక్ర వాహనంతో వెళ్లకూడదు. మధ్యలో మ్యాన్‌హోల్‌ ఉంటే కనిపించక ప్రమాదం జరిగే అవకాశం ఉంది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని