అధికారులు అప్రమత్తంగా ఉన్నారు
eenadu telugu news
Published : 28/09/2021 04:03 IST

అధికారులు అప్రమత్తంగా ఉన్నారు

గ్రేటర్‌ మేయర్‌ గద్వాల విజయలక్ష్మి

ఈనాడు డిజిటల్‌, హైదరాబాద్‌: భారీ వర్షాల వల్ల ఆస్తి, ప్రాణ నష్టం జరగకుండా చర్యలు చేపడుతున్నట్లు మేయర్‌ గద్వాల విజయలక్ష్మి తెలిపారు. సోమవారం జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. అధికారులంతా అప్రమత్తంగా ఉన్నారని, ముంపు బాధితుల కోసం పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. 195 అత్యవసర బృందాలు, 71 స్టాటిస్టిక్స్‌ బృందాలు ఏర్పాటు చేశామన్నారు. నగరవాసులు ఏ సమస్య ఉన్నా 040- 21111111 నంబర్‌ను సంప్రదించాలని సూచించారు. ఉప మేయర్‌ శ్రీలత మాట్లాడుతూ గతేడాది అనుభవాల దృష్ట్యా పక్కా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. సోమవారం సాయంత్రం వరకు 312 ఫిర్యాదులురాగా అందులో 297 పరిష్కరించామని, మిగతావి వాటిపై దృష్టి సారించామన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని