అనుమానాస్పద స్థితిలో వ్యక్తి ఆత్మహత్య
eenadu telugu news
Published : 29/09/2021 01:40 IST

అనుమానాస్పద స్థితిలో వ్యక్తి ఆత్మహత్య

షాపూర్‌నగర్‌: అనుమానాస్పద స్థితిలో వ్యక్తి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన జగద్గిరిగుట్ట పోలీస్‌స్టేషన్‌ పరిధిలో జరిగింది. పోలీసులు, కుటుంబసభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. మెదక్‌ జిల్లా, పాపన్నపేట మండలం, మినుపూర్‌ గ్రామానికి చెందిన గడ్డం అంజిరెడ్డి(43) కొన్ని సంవత్సరాల క్రితం నగరానికి వలసొచ్చి ఎన్టీఆర్‌నగర్‌లో ఉంటున్నాడు. స్తిరాస్థి, ఫైనాన్స్‌ వ్యాపారం చేస్తుంటాడు. భార్య సునీత, ఇద్దరు పిల్లలున్నారు. మూడు రోజుల క్రితం భార్య, పిల్లలు బౌరంపేటలోని పుట్టింటికి వెళ్లారు. సోమవారం అంజిరెడ్డికి ఫోన్‌ చేసినా స్పందించలేదు. మంగళవారం ఇంటి సమీప బంధువులకు ఫోన్‌ చేయగా వారు వెళ్లి చూడగా ఉరేసుకుని పడిఉన్నాడు. మృతదేహం నేలపై కూర్చుని ఉండడం, లోపల గడియ వేసుకోకుండా ఇంట్లో టీవీ నడుస్తుండటంతో ఎవరైనా హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అతనికి ఆర్థిక ఇబ్బందులు, ఎవరితో విభేదాలు లేవని భార్య పోలీసులకు తెలిపింది. పోలీసులు మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని