బరిలోకి దిగితే...పతకం వచ్చేస్తుంది!
eenadu telugu news
Published : 29/09/2021 01:40 IST

బరిలోకి దిగితే...పతకం వచ్చేస్తుంది!

‘పేట’ విద్యార్థులు...కరాటేలో మెరికలు
న్యూస్‌టుడే, సదాశివపేట

రాటే విద్యను సాధన చేయడం ద్వారా ఆత్మస్థైర్యంతో పాటు మనోధైర్యం పెంపొందుతాయి. అంతేకాదు పోటీల్లో పాల్గొని పతకాలు సాధించినప్పుడు నూతనోత్తేజం కలుగుతుంది. మళ్లీ పోటీ పడాలని ఆరాట పడతారు. దీనికి నిదర్శనంగా నిలుస్తున్నారు సదాశివపేట విద్యార్థులు. వీరు ఎక్కడ కరాటే పోటీలు జరిగినా బహుమతులన్నీ తమకేనంటూ ఇతరులకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నారు. దశాబ్దన్నర కాలంగా శిక్షణ తీసుకుంటూ పోటీలకు హాజరవుతున్నారు. ఇప్పటికే రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొని బహుమతులు సాధించారు. కరాటేపై అసక్తి ఉన్న విద్యార్థులకు జపాన్‌ కరాటే అసోసియేషన్‌ వారు అవసరమైన శిక్షణ ఇస్తున్నారు. శిక్షకుడు శంకర్‌గౌడ్‌ విద్యార్థులను ప్రోత్సహిస్తున్నారు. ఈ ఏడాది మార్చి 22వ తేదీన హైదరాబాద్‌లో జపాన్‌ కరాటే ఇంటర్నేషనల్‌ ఆధ్వర్యంలో జరిగిన రాష్ట్ర స్థాయి బ్లాక్‌ బెల్ట్‌ పోటీల్లో పట్టణానికి చెందిన 8 మంది విద్యార్థులు తమ ప్రతిభను కనబరిచి బ్లాక్‌ బెల్ట్‌లు సాధించి ప్రముఖుల చేత ఆవార్డులను అందుకున్నారు. విద్యార్థులు మనోగతాలు వారి మాటాల్లోనే..
ప్రోత్సహిస్తే మరింత ప్రతిభ  - పి.శ్రీజ, విద్యార్థి
ఎనిమిది సంవత్సరాలుగా కరాటేలో శిక్షణ పొందుతున్నాను. చిన్ననాటి నుంచి తల్లిదŸండ్రులు ప్రోత్సహిస్తున్నారు. రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొని బ్లాక్‌బెల్ట్‌ సాధించడం చెప్పలేని సంతోషాన్ని కలిగించింది. బాలికల్లో ఆత్మస్థైర్యాన్ని పెంపొందించేందుకు తల్లిదండ్రులు కరాటేను ప్రోత్సహించాలి.
ఆత్మరక్షణకు ఎంతో ఉపయోగం - వెంకట్రామ్‌ గౌడ్‌, విద్యార్థి
కరాటే విద్య ఆత్మరక్షణకు ఎంతో ఉపయోగపడుతోంది. ఇప్పటికే స్పారింగ్‌ విభాగంలో రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొని ద్వితీయ బహుమతి సాధించాను. చదువుతో పాటు కరాటే విద్య కూడా ఎంతో అవసరం.
ప్రభుత్వ చేయూత అవసరం - కనిగరి శంకర్‌గౌడ్‌, శిక్షకుడు
చదువుతో పాటు కరాటే విద్యను అభ్యసించడానికి ప్రభుత్వం తగిన చేయూతనివ్వాలి. కరాటే నేర్చుకోవడానికి ఉచిత సౌకర్యాలు కల్పిస్తే ఎక్కువ మంది అసక్తి చూపుతారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని