యువతిని బైక్‌పై తీసుకెళ్తున్న యువకుడిపై దాడి
eenadu telugu news
Published : 29/09/2021 03:55 IST

యువతిని బైక్‌పై తీసుకెళ్తున్న యువకుడిపై దాడి

నాంపల్లి, న్యూస్‌టుడే: స్నేహితురాలిని ద్విచక్ర వాహనంపై తీసుకెళ్తున్న యువకుడిపై మరో వర్గానికి చెందిన కొందరు యువకులు దాడిచేశారు. నాంపల్లి పోలీసుల కథనంప్రకారం.. విజయవాడకు చెందిన నవీన్‌(24), అదే ప్రాంతానికి చెందిన యువతి(22) స్నేహితులు. బీటెక్‌ పూర్తిచేసిన వీరు ఈనెల 26న ఎంబీసీలో అడ్మిషన్‌కని మెహిదీపట్నం నుంచి మలక్‌పేట వెళ్తున్నారు. దారిలో కొందరు యువకులు బైక్‌లపై వీరిని వెంబడించి బజార్‌ఘాట్‌ వద్ద అడ్డగించారు. తమ వర్గానికి చెందిన యువతిని బైక్‌పై తీసుకెళ్తావా.. అంటూ మూకుమ్మడిగా దాడిచేశారు. ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారడంతో నాంపల్లి పోలీసులు విచారించి, దాడికి పాల్పడిన అలీఅబ్బాస్‌(21), రషీద్‌(20), సక్లిమ్‌(18)ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని