భూ వివాదం.. ఓ వ్యక్తి తుపాకీతో హల్‌చల్‌
eenadu telugu news
Published : 29/09/2021 03:55 IST

భూ వివాదం.. ఓ వ్యక్తి తుపాకీతో హల్‌చల్‌

శంషాబాద్‌, న్యూస్‌టుడే: భూ వివాదం నేపథ్యంలో ప్రత్యర్థులపై ఓ వ్యక్తి తుపాకీతో హల్‌చల్‌ చేసిన సంఘటన మంగళవారం శంషాబాద్‌లో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం..మైలార్‌దేవ్‌పల్లికి చెందిన రామకృష్ణయాదవ్‌ కుటుంబ సభ్యులకు, కర్మాన్‌ఘాట్‌కు చెందిన వెంకట్‌రెడ్డికి తొండుపల్లి రెవెన్యూ పరిధిలో భూవివాదం మూడేళ్లుగా కొనసాగుతుంది. మంగళవారం వెంకట్‌రెడ్డి తన కుటుంబ సభ్యులు, స్నేహితులు, అనుచరులతో కలిసి భూమిని చదును చేయడానికి యత్నించాడు. అడ్డుకోవడానికి యత్నించిన రామకృష్ణయాదవ్‌ కుటుంబ సభ్యులపై ఇనుప రాడ్లు, కర్రలతో దాడి చేశారు. ఉప్పర్‌పల్లికి చెందిన దామోదర్‌రెడ్డి తుపాకీ ఎక్కుపెట్టి భయభ్రాంతులకు గురి చేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకునే లోపే పరారయ్యారు. ఆయుధ చట్టం కింద ఆరు మందిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని