తెరాస ప్లీనరీ ఏర్పాట్ల పరిశీలన
eenadu telugu news
Published : 17/10/2021 03:29 IST

తెరాస ప్లీనరీ ఏర్పాట్ల పరిశీలన


పార్కింగ్‌ ప్రదేశాలను పరిశీలిస్తున్న ఎంపీ రంజిత్‌రెడ్డి, ఎమ్మెల్యే గాంధీ తదితరులు

మాదాపూర్‌, న్యూస్‌టుడే: తెరాస పార్టీ ద్విదశాబ్ది వేడుకల్లో భాగంగా ఈ నెల 25న నిర్వహించనున్న ప్లీనరీ సమావేశ ఏర్పాట్లపై శనివారం సమీక్షా నిర్వహించారు. ప్లీనరీ ఆహ్వాన కమిటీ సభ్యులు చేవెళ్ల ఎంపీ రంజిత్‌రెడ్డి, ఎమ్మెల్యే గాంధీ హైటెక్స్‌ ప్రాంగణాన్ని పరిశీలించారు. ప్లీనరీకి వచ్చే ప్రతినిధుల కోసం చేస్తున్న ఏర్పాట్లు, సభా వేదిక, పార్కింగ్‌ ప్రదేశాలపై వాకబు చేశారు. ముఖ్యంగా వాహనాల పార్కింగ్‌ ప్రదేశాలను ట్రాఫిక్‌ డీసీపీ విజయ్‌కుమార్‌తో కలిసి పరిశీలించి ట్రాఫిక్‌ సమస్య లేకుండా సాధారణ ప్రజలకు ఇబ్బందులు కలగకుండా తీసుకోవాల్సిన జాగ్త్రతలపై చర్చించారు. ఖానామెట్‌ చౌరస్తా సమీపాన ఉన్న ఖాళీ స్థలంలో వాహనాలను నిలిపేలా చదును చేయాలని నిర్ణయించారు ప్లీనరీకి వచ్చే ప్రతినిధులకు, నాయకులకు ఇబ్బంది కలగకుండా, నిర్ణీత కాలానికి ముందే ఏర్పాట్లన్నీ పూర్తి కావాలని ప్లీనరీ నిర్వహణ కమిటీ సభ్యులకు సూచించారు. ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్‌, ఎమ్మెల్సీ నవీన్‌రావు, టీఎస్‌ఐఐసీ ఛైర్మన్‌ బాలమల్లు, పౌరసరఫరాల ఛైర్మన్‌ శ్రీనివాస్‌రెడ్డి, మాజీ మేయర్‌ బొంతు రామ్మోహన్‌, మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్‌, టీఆర్‌ఎస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బండి రమేశ్‌, స్థానిక కార్పొరేటర్‌ జగదీశ్వర్‌గౌడ్‌ తదితరులున్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని