రైతుల ఆర్థిక పురోగతే. లక్ష్యం
eenadu telugu news
Published : 17/10/2021 03:29 IST

రైతుల ఆర్థిక పురోగతే. లక్ష్యం


ట్రాక్టర్‌ను అందజేస్తున్న డీసీసీబీ అధ్యక్షులు మనోహర్‌రెడ్డి

కుల్కచర్ల, న్యూస్‌టుడే: రైతులు ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు అవసరమైన రుణాలను మంజూరు చేస్తున్నామని డీసీసీబీ అధ్యక్షులు బుయ్యని మనోహర్‌రెడ్డి తెలిపారు. కుల్కచర్ల మండల కేంద్రంలో సాల్వీడ్‌ గ్రామానికి చెందిన రైతుకు డీసీసీబీ ద్వారా ట్రాక్టర్‌ను అందజేశారు. అనంతరం మండల తెరాస అధ్యక్షులు శేరిరాంరెడ్డి, విపణి అధ్యక్షులు హరికృష్ణ, మండల రైతు సమన్వయ సమితి అధ్యక్షులు కెబి రాజు, కుల్కచర్ల మాజీ ఎంపీటీసీ క్రిష్ణగౌడ్‌ తదితరులతో కలసి ఆయన మాట్లాడారు. గతంలో ఎన్నడూ లేని విధంగా జిల్లాలోని రైతులకు వందల కోట్ల రూపాయల రుణాలను ఇప్పటికే అందించామన్నారు. స్వయం సహాయక సంఘాలకు కూడా రుణాలను అందించేందుకు అవసరమైన చర్యలను తీసుకుంటున్నామని తెలిపారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని