భక్తజన సంద్రం.. చిలుకూరు ఆలయం
eenadu telugu news
Published : 17/10/2021 04:14 IST

భక్తజన సంద్రం.. చిలుకూరు ఆలయం


బాలాజీని దర్శించుకుంటున్న భక్తులు

మొయినాబాద్‌, న్యూస్‌టుడే: చిలుకూరు బాలాజీ ఆలయం భక్తజన సంద్రంగా మారింది. దసరాతో పాటు వరుస సెలవులు రావడంతో ఆలయానికి భక్తులు పోటెత్తారు. శనివారం తెల్లవారుజామునే ఆలయాన్ని తెరిచిన పూజారులు ముందుగా హారతి పూజ పూర్తి చేసి భక్తులకు దర్శనాలు ప్రారంభించారు. కరోనా కారణంగా మహాద్వార దర్శనాలకే అనుమతిచ్చారు. ఏకాదశితో పాటు శనివారం కావడంతో ఆలయానికి భక్తులు అశేషంగా తరలివచ్చారని, సాయంత్రం 6 గంటల వరకు సుమారుగా 50వేలకు పైగా భక్తులు స్వామిని దర్శించుకున్నారని ఆలయ అర్చకుడు సీఎస్‌ రంగరాజన్‌ వెల్లడించారు. భక్తుల రద్దీ అధికంగా ఉండటంతో ఆలయ పరిసర ప్రాంతాల్లో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని