‘విశ్వనాథ్‌ విశ్వరూపం’ పుస్తకావిష్కరణ
eenadu telugu news
Published : 17/10/2021 05:11 IST

‘విశ్వనాథ్‌ విశ్వరూపం’ పుస్తకావిష్కరణ


పుస్తకంతో కె.విశ్వనాథ్‌, తనికెళ్ల భరణి, రామశాస్త్రి

ఫిలింనగర్‌, న్యూస్‌టుడే: ప్రముఖ సినీ దర్శకుడు కె.విశ్వనాథ్‌ తీసిన సినిమాలపై డా.ఏ.ఎస్‌.రామశాస్త్రి రచించిన ‘విశ్వనాథ్‌ విశ్వరూపం’ పుస్తకావిష్కరణ శుక్రవారం ఫిలింనగర్‌లో నిర్వహించారు. దర్శకుడు కె.విశ్వనాథ్‌ స్వయంగా పుస్తకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. తన చిత్రాలపై పరిశీలనాత్మక రచన చేయడం సంతోషంగా ఉందన్నారు. ఇలాంటి పుస్తకం చదివే ప్రేక్షకులకు సినిమాలపై ఆసక్తి పెరుగుతుందన్నారు. పుస్తకానికి ముందు మాట రాసిన హాస్య నటుడు తనికెళ్ల భరణి మాట్లాడుతూ.. విశ్వనాథ్‌ అంటే అందరికి ఉండే అభిమానం ప్రేమ, రచయిత రామశాస్త్రి విషయంలో భక్తిగా మారిందన్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని