‘కౌశల్యం’తో తిరుమల ఆవిష్కరణ
eenadu telugu news
Published : 17/10/2021 05:11 IST

‘కౌశల్యం’తో తిరుమల ఆవిష్కరణ

న ఇంట్లో థర్మకోల్‌తో తిరుమల తిరుపతి ఆలయాన్ని తయారు చేశారు హైదరాబాద్‌ కాప్రాకు చెందిన కొమండూరి కౌశల్‌. బీటెక్‌ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. చిన్నప్పటి నుంచి అతనికి క్రాఫ్ట్‌ వర్క్‌ అంటే ఎంతో ఇష్టం. చూసిన ప్రదేశం, పుణ్య క్షేత్రాలు, బొమ్మలు ఏవైనా వాటిని ఆకలింపు చేసుకునేవాడు. వాటిని క్షణాల్లో పెయింటింగ్‌, బొమ్మలు తయారు చేయడం, ఆ ప్రదేశాల సెట్‌ వేయడం అతని అభిరుచి. థర్మకోల్‌, కాగితం, కార్డుబోర్డు, ప్లాస్టర్‌ ఆఫ్‌ ప్యారిస్‌, చెక్కలు, రంపపు పొట్టు ఉపయోగించి తిరుమల ఆలయాన్ని తయారు చేశారు.అందుకు రూ.25 వేలు ఖర్చు చేసినట్లు విద్యార్థి చెప్పారు. మూడు వారాల్లో ఈ క్రతువును పూర్తి చేశారు. ఆలయంతో పాటు తిరుపతి పట్టణాన్ని తయారు చేశారు. దాన్ని చూడడానికి పలువురు ఇంటికి వరుస కట్టారు. గతేడాది తమిళనాడులోని శ్రీరంగంలోని రంగనాథ ఆలయ సెట్‌ ఆవిష్కరించినట్లు చెప్పారు.

- న్యూస్‌టుడే, కాప్రా


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని