TRS: తెరాస అధ్యక్ష పదవికి కేసీఆర్‌ తరఫున నామినేషన్‌
eenadu telugu news
Updated : 17/10/2021 14:26 IST

TRS: తెరాస అధ్యక్ష పదవికి కేసీఆర్‌ తరఫున నామినేషన్‌

ఆర్వోకి నామినేషన్‌ పత్రాలు అందజేసిన మంత్రులు

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడిగా సీఎం కేసీఆర్‌ పేరును ప్రతిపాదిస్తూ ఆ పార్టీ నేతలు నామినేషన్‌ దాఖలు చేశారు. ఆ పార్టీ అధ్యక్ష ఎన్నికకు నేటి నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కావడంతో కేసీఆర్‌ తరఫున ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి (ఆర్వో)కి మంత్రులు మహమూద్‌ అలీ, సబితాఇంద్రారెడ్డి, సత్యవతి రాఠోడ్‌, ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఇంద్రకరణ్‌రెడ్డి, నిరంజన్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్‌, తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, జగదీశ్‌ రెడ్డి, మల్లారెడ్డి, పువ్వాడ అజయ్‌ నామినేషన్‌ పత్రాలు అందజేశారు.

 అధ్యక్ష పదవికి నేటి నుంచి ఈనెల 22 వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. ఈనెల 23న నామినేషన్ల పరిశీలన, 24న నామినేషన్ల ఉపసంహరణ ఉంటుంది. ఈనెల 25న నిర్వహించే తెరాస ప్లీనరీలో అధ్యక్షుడిని ఎన్నుకోనున్నారు. 

 



Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని