బీసీ కుల గణనకు కేంద్రంపై ఒత్తిడి పెంచుతాం
eenadu telugu news
Published : 18/10/2021 03:58 IST

బీసీ కుల గణనకు కేంద్రంపై ఒత్తిడి పెంచుతాం


గుజ్జ కృష్ణకు పుష్పగుచ్ఛం అందజేస్తున్న రాజ్‌కుమార్‌. చిత్రంలో ఆర్‌.కృష్ణయ్య తదితరులు

బర్కత్‌పుర, న్యూస్‌టుడే: బీసీ కుల గణనకు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు కార్యక్రమాలు నిర్వహించన్నుట్లు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్‌.కృష్ణయ్య తెలిపారు. ఈ నెల 18 నుంచి రాష్ట్రాల పర్యటనకు శ్రీకారం చుట్టనున్నట్లు చెప్పారు. బీసీ సంక్షేమ సంఘం జాతీయ కన్వీనర్‌గా నియమితులైన గుజ్జ కృష్ణను ఆదివారం విద్యానగర్‌ బీసీ భవన్‌లో సంఘాల నేతలు సన్మానించారు. ఈ సందర్భంగా ఆర్‌.కృష్ణయ్య మాట్లాడుతూ బీసీ కుల గణన చేపట్టకుంటే భాజపా తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. గుజ్జ కృష్ణ మాట్లాడుతూ కుల గణనపై కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరి విడనాడాలని అన్నారు. బీసీ సంఘాల నేతలు లాల్‌కృష్ణ, రాజ్‌కుమార్‌, ఉదయ్‌ నేత తదితరులు పాల్గొన్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని