నా చిరునవ్వు వెనుక ఉన్నది ఆయనే!
eenadu telugu news
Published : 18/10/2021 03:58 IST

నా చిరునవ్వు వెనుక ఉన్నది ఆయనే!

సినీ నటుడు అక్కినేని నాగార్జున

ఈనాడు డిజిటల్‌, హైదరాబాద్‌: ‘సినీ తారలకు మెరిసే దంతాలు ఎంతో అవసరం.. ఎన్నో ఏళ్లుగా దంత వైద్యులు డా.అట్లూరి మోహన్‌ నా నవ్వుని అందంగా ఉంచుతున్నారు.’ అని నటుడు అక్కినేని నాగార్జున పేర్కొన్నారు. డా.మోహన్‌ జూబ్లీహిల్స్‌లో ఏర్పాటు చేసిన సాయి డెంటల్‌ క్లినిక్‌ నూతన శాఖను సతీమణి అమలతో కలిసి నాగార్జున ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ.. ‘నాకు పదేళ్ల వయసు ఉన్నప్పుడు సుల్తాన్‌బజార్‌లో ఉండే పద్మశ్రీ డా.ఎంఎస్‌ నారాయణను సంప్రదించేవాడిని.. చాకొలెట్లు తింటే వచ్చే పిప్పి పళ్లకు నొప్పి లేకుండా చికిత్స చేసేవారు.. తర్వాత ఆయన కుమారుడు మోహన్‌ నాతో పాటు వందల మంది సినీ నటులకు దంత వైద్యుడిగా ఉన్నారు.’ అని తెలిపారు. తెలుగు రాష్ట్రాల్లోని అన్ని నగరాలకు ఆయన సేవల్ని విస్తరించాలని ఆకాంక్షించారు. అనంతరం డాక్టర్‌ మోహన్‌ మాట్లాడుతూ.. భవిష్యత్తు మొత్తం డిజిటల్‌ డెంటిస్ట్రీదేనని, ఆధునిక సాంకేతికత ఆధారంగా దంత చికిత్స అందిస్తున్నామని వివరించారు. వేలాది మందికి అందమైన చిరునవ్వు అందించేందుకు 55 ఏళ్లుగా కృషి చేస్తున్నామన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని