చార్మినార్ కే షాన్.. నగరం మురిసెన్
eenadu telugu news
Published : 18/10/2021 03:58 IST

చార్మినార్ కే షాన్.. నగరం మురిసెన్

చార్మినార్‌ పరిసరాల్లో ప్రత్యేకంగా ఏర్పాటైన స్టాళ్ల చెంత కిటకిటలాడుతున్న సందర్శకులు

ఈనాడు డిజిటల్‌, హైదరాబాద్‌, చార్మినార్‌, న్యూస్‌టుడే: రంజాన్‌ పండగ రాలేదు.. షాపింగుల సమయమూ కాదు.. ఇవేవీ లేకున్నా.. తొలిసారి పాతబస్తీ గల్లీల్లో కాలు కదిపే సందు లేదు.. మువ్వన్నెల రంగులద్దుకుని మురిసిపోయే చార్మినారు.. మనసును లాగి అడుగులు ఆవైపు వేయించుకునే నవాబుల రుచులు.. వెన్నెల కాంతుల్లో వెలిగిపోతున్న వీధులు.. ఆకట్టుకున్న పోలీసు బ్యాండు ప్రదర్శనలు, విభిన్న కళా రూపాలు.. వీటన్నింటి నడుమ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ‘ఏక్‌ షామ్‌ చార్మినార్‌ కే నామ్‌’ కార్యక్రమం తొలి ఆదివారం అట్టహాసంగా మొదలైంది. హెచ్‌ఎండీఏ, జీహెచ్‌ఎంసీ, పోలీసు శాఖలు సంయుక్తంగా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశాయి. వివిధ కళా బృందాల ప్రదర్శనలు జనాన్ని ఆకట్టుకున్నాయి. పండగలు, ఆదివారం కలిసిరావడంతో వేడుకను చూసేందుకు నగర వ్యాప్తంగా పెద్దఎత్తున జనం తరలివచ్చారు. అర్ధరాత్రి వరకు లాడ్‌ బజార్‌ వద్ద గాజుల కొనుగోళ్లు జరిగాయి. దక్కన్‌ ముషాయిరా, లేజర్‌ లైటింగులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. మరోవైపు ట్యాంక్‌బండ్‌ ఫన్‌డే వేడుకల్లోనూ జనం సందడి చేశారు. రెండుచోట్ల హెచ్‌ఎండీఏ ఆధ్వర్యంలో సందర్శకులకు ఉచిత మొక్కల పంపిణీ చేపట్టారు.


ఆదివారం సాయంత్రం ట్యాంకుబండ్‌కు పోటెత్తిన జనం


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని