ఘనంగా కల్నల్‌ పీఎల్‌ఎన్‌ చౌదరి శతజయంతి వేడుకలు
eenadu telugu news
Published : 18/10/2021 04:04 IST

ఘనంగా కల్నల్‌ పీఎల్‌ఎన్‌ చౌదరి శతజయంతి వేడుకలు


చౌదరికి నివాళులర్పిస్తున్న పీఎల్‌ఎన్‌ చౌదరి కుటుంబ సభ్యులు

ఈనాడు డిజిటల్‌, హైదరాబాద్‌: ప్రిన్స్‌ ఆఫ్‌ వేల్స్‌ రాయల్‌ ఇండియన్‌ మిలిటరీ కాలేజీలో చేరిన తొలి తెలుగు వ్యక్తి కల్నల్‌ పీఎల్‌ఎన్‌ చౌదరి శత జయంతి వేడుకలను ఆదివారం ఘనంగా నిర్వహించారు. సైనిక్‌పురిలోని పబ్లిక్‌ పార్కులో జరిగిన ఈ కార్యక్రమంలో విశ్రాంత సైనికాధికారులు పాల్గొని, భారత సైన్యానికి చౌదరి చేసిన సేవలను కొనియాడారు. 1933లో మిలిటరీ కాలేజీ తొలి తెలుగు విద్యార్థిగా, 1941లో కమిషన్డ్‌ అధికారిగా బాధ్యతలు చేపట్టిన చౌదరి దాదాపు 27 ఏళ్ల పాటు వివిధ హోదాల్లో సేవలందించారన్నారు. బర్మా-మలయా రెండో ప్రపంచ యుద్ధం సమయంలో వీరోచితంగా పోరాడిన ఆయన.. అరుణాచల్‌ప్రదేశ్‌లోని దిరాంగ్‌, తవాంగ్‌ల సేలాపాస్‌ మీదుగా టిబెట్‌ శరణార్థులతో కలిసి 11 నెలల్లోనే రోడ్డు మార్గం పూర్తిచేసి చరిత్ర సృష్టించారన్నారు. బాక్రానంగల్‌ వంతెనను కాపాడి అప్పటి రాష్ట్రపతి వీవీ గిరి చేతుల మీదుగా తొలి అతి విశిష్ఠ పురస్కారాన్ని అందుకున్నారని గుర్తు చేసుకున్నారు. కార్యక్రమంలో ఆయన కుమారులు మేజర్‌ పీటీ చౌదరి, కల్నల్‌ పీవీకే చౌదరి, లోకాధిత్య చౌదరి, డాక్టర్‌ పీకేఎన్‌ చౌదరి, తదితరులు పాల్గొన్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని