దామోదరం సంజీవయ్య కార్యక్రమాలను అధికారికంగా నిర్వహించాలి: వీహెచ్‌
eenadu telugu news
Updated : 18/10/2021 17:22 IST

దామోదరం సంజీవయ్య కార్యక్రమాలను అధికారికంగా నిర్వహించాలి: వీహెచ్‌


హైదరాబాద్‌: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య జయంతి, వర్ధంతి కార్యక్రమాలను ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు వి.హనుమంతరావు డిమాండ్ చేశారు. ఆ కార్యక్రమాల్లో కాంగ్రెస్ నాయలు తప్పకుండా పాల్గొనాలని సూచించారు. దామోదరం సంజీవయ్య అత్యంత నిజాయతీపరుడని.. ఆయన్ను గౌరవించుకోవాలని తెలిపారు. కర్నూల్‌లో ఉన్న ఆయన ఇంటిని అభివృద్ధి చేయడానికి జనసేన అధినేత పవన్‌కల్యాణ్ ముందుకు రావడంపై వీహెచ్‌ హర్షం వ్యక్తం చేశారు. 

 Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని