పకడ్బందీగా ఇంటర్‌ పరీక్షలు: మోతీలాల్‌
eenadu telugu news
Published : 19/10/2021 01:21 IST

పకడ్బందీగా ఇంటర్‌ పరీక్షలు: మోతీలాల్‌

సమావేశంలో మాట్లాడుతున్న జిల్లా అదనపు పాలనాధికారి

వికారాబాద్‌ కలెక్టరేట్‌, న్యూస్‌టుడే: ఇంటర్‌ ప్రథమ సంవత్సరం పరీక్షలు పకడ్బందీగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని జిల్లా అదనపు పాలనాధికారి మోతీలాల్‌ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో ఇంటర్మీడియట్‌ జిల్లా స్థాయి సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈనెల 25వ తేదీ నుంచి నవంబరు 2 వరకు పరీక్షలు కొనసాగుతాయన్నారు. ఒక్క నిమిషం ఆలస్యంగా వచ్చినా విద్యార్థులను అనుమతించవద్దని, కేంద్రాల వద్ద 144 సెక్షన్‌ అమలు చేయాలని ఆదేశించారు. పరిసరాల్లో జిరాక్స్‌ సెంటర్లను మూసివేయాలన్నారు. ఆర్డీవో, తహసీల్దార్లతో ప్రత్యేక తనిఖీ బృందాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. కేంద్రాల్లో విద్యుత్తు సరఫరాకు అంతరాయం లేకుండా చూడాలని, నీటి సౌకర్యం కల్పించాలన్నారు. అవసరమైతే వైద్యం అందించే విధంగా సిబ్బంది అందుబాటులో ఉంచాలని సూచించారు. కార్యక్రమంలో ఇంటర్మీడియట్‌ నోడల్‌ అధికారి శంకర్‌నాయక్‌, ఆర్డీవో ఉపేందర్‌రెడ్డి, జిల్లా వైద్యాధికారి డాక్టర్‌ తుకారాంభట్‌, డీఎస్పీ సత్యనారాయణ, ఆర్టీసీ డివిజనల్‌ మేనేజర్‌ రమేశ్‌, విద్యాశాఖ సహాయ సంచాలకుడు అబ్దుల్‌ ఘనీ తదితరులు పాల్గొన్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని