పాముకాటుతో ఒకరు..
eenadu telugu news
Published : 19/10/2021 01:21 IST

పాముకాటుతో ఒకరు..

హత్నూర, న్యూస్‌టుడే:  పాముకాటుతో ఓ వ్యక్తి మృతిచెందిన ఘటన సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం ముచ్చర్లలో సోమవారం చోటుచేసుకుంది. గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం.. తాల్క ఎల్లయ్య(45) ఇంట్లోకి నాగుపాము ప్రవేశించి గదిలో కుండల మధ్యన నక్కింది. ఈ విషయాన్ని కుటుంబ సభ్యులు గుర్తించలేకపోయారు. సోమవారం మధ్యాహ్నం ఎల్లయ్య ఇంట్లో వస్తువులను సర్ధుతుండగా పాము చేతికి కాటువేసింది. తనను పాము కరిచిందని కుటుంబ సభ్యులకు ఆలస్యంగా చెప్పిన ఆయన తదుపరి అక్కడే దాని కోసం వెతికాడు. ఆయినా పాము ఆచూకీ లభించలేదు. ఈ క్రమంలో ఆయన అపస్మారక స్థితికి వెళ్లగా కుటుంబ సభ్యులు సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో ఎల్లయ్య మృత్యువాతపడ్డాడు. సకాలంలో ఆసుపత్రికి తీసుకెళ్తే బతికేవాడని, నాటు వైద్యం చేయించడంతో అతడి ప్రాణాల మీదికి వచ్చిందని గ్రామస్థులు తెలిపారు. ఆయనకు భార్య మొగులమ్మ, కుమారుడు ఉన్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని