Cyber Crime: సైబర్‌ మోసగాడి వలలో చిక్కిన సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌
eenadu telugu news
Published : 19/10/2021 07:11 IST

Cyber Crime: సైబర్‌ మోసగాడి వలలో చిక్కిన సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌

న్యూస్‌టుడే, సిద్దిపేట అర్బన్‌: సైబర్‌ నేరగాడి వలలో చిక్కుకున్న ఓ సాప్ట్‌వేర్‌ ఇంజినీర్‌ మోసపోయారు. కొత్త క్రెడిట్‌ కార్డును వాడుకోవడానికి యత్నించే దశలో ఖాతాలోని సొమ్ము పోగొట్టుకున్నారు. సిద్దిపేట మూడో ఠాణా సీఐ ప్రవీణ్‌కుమార్‌ తెలిపిన వివరాలు.. పట్టణంలోని రంగధాంపల్లికి చెందిన కార్తీక్‌రెడ్డి హైదరాబాద్‌లో సాప్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం ఇంటి వద్ద ఆన్‌లైన్‌లో విధులు నిర్వహిస్తున్నారు. ఇటీవల ఇండస్‌ ఇండ్‌ బ్యాంకు నుంచి క్రెడిట్‌ కార్డు తెప్పించుకున్నారు. దానిని వాడుకోవడానికి చరవాణి ద్వారా అంతర్జాలంలో వెతికారు. ఈ నెల 16న బ్యాంకు ప్రతినిధిగా ఓ వ్యక్తి ఫోన్‌లో పరిచయం చేసుకొని.. కార్డు నంబరు, పని చేయడం నిమిత్తం లింకు పంపుతున్నామని.. దానిని తెరవాలని సూచించారు. లింకును కార్తీక్‌ తెరవగానే తన ఖాతాలోని రూ.49,995 డెబిట్‌ అయినట్లు సందేశం వచ్చింది. సంబంధిత బ్యాంకుకు వెళ్లి విచారించగా నగదు డెబిట్‌ అయినట్లు సిబ్బంది చెప్పారు. వారి సూచనతో సోమవారం పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేయగా కేసు నమోదైంది.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని