అక్రమాలకు అధికారిక ముద్ర!
eenadu telugu news
Published : 19/10/2021 03:17 IST

అక్రమాలకు అధికారిక ముద్ర!

లేఅవుట్లోనే మరో లేఅవుట్‌కు హెచ్‌ఎండీఏ అనుమతి
ఈనాడు డిజిటల్‌, హైదరాబాద్‌; నార్సింగి, న్యూస్‌టుడే

పుప్పాలగూడ గ్రామ పంచాయతీ పరిధిలోని సర్వే నంబరు 87, 119లో 17.36ఎకరాలలో తిరుమలహిల్స్‌ పేరిట 1990లో హుడా లేఔట్‌కి అనుమతిచ్చింది. 8,633 గజాలను పార్కు స్థలంగా నిర్దేశించారు. 1993లో పంచాయతీకి గిఫ్ట్‌డీడ్‌ అయిన ఈ భూమికి ఏడాది తర్వాత తుది లేఅవుట్‌ గుర్తింపు దక్కింది. కొన్నేళ్ల కిందట ప్రైవేటు వ్యక్తులు 6వేల గజాల పార్కు స్థలాన్ని కలుపుతూ ఓ కొత్త లేఅవుట్‌ అనుమతులకు దరఖాస్తు చేసుకున్నారు. పరిశీలన లేకుండానే పార్కు స్థలంలో డబుల్‌ లేఅవుట్‌కి అనుమతిచ్చింది హెచ్‌ఎండీఏ. రూ.50కోట్ల స్థలం కబ్జాకు గురవుతున్నా.. కమిషనర్‌కు ఫిర్యాదు అందినా స్పందించలేదు. ఇది వివాదాస్పదం కాగా.. సోమవారం కాలనీసంఘం జిల్లా అదనపు కలెక్టర్‌ ప్రతీక్‌ జైన్‌ను కలిసి ఫిర్యాదు చేసింది.  

అలకాపురి టౌన్‌షిప్‌లోని వివేకానందనగర్‌ కాలనీలో 97, 98, 99 సర్వే నంబర్లలో దాదాపు 1100 గజాల విస్తీర్ణంలో ఈతకొలను, చెట్లతో పార్కు స్థలం ఉండేది. దానికి ఆనుకొనే కాలనీ సంఘానికి చెందిన క్లబ్‌ హౌజ్‌ ఉంది. అయితే ఈ భూమిని కొందరు 95/పి సర్వే నంబర్‌లో 47, 47ఏ ప్లాట్లుగా సృష్టించి 2018లో డబుల్‌ రిజిస్ట్రేషన్‌ చేయించారు. ఇక్కడున్న కొలను, చెట్లను కూలదోసి ఐదంతస్తుల భవనం నిర్మించారు. అడ్డుకునే ప్రయత్నం చేసినా అధికారికంగా పొందిన తప్పుడు పత్రాలు చూపించి నిర్మాణం చేపట్టారని కాలనీ సంఘం ప్రతినిధులు ఆరోపించారు.

అదనపు కలెక్టర్‌ ప్రతీక్‌తో తిరుమలహిల్స్‌ కాలనీ ప్రతినిధులు

మహానగరం విస్తరిస్తోంది.. చెట్టూచేమా కనిపించకుండాపోయి కాంక్రీటు కీకారణ్యంగా మారుతోంది. అక్కడక్కడా మిగిలి కాస్త ఊపిరినిస్తున్న ఉద్యానాలూ కబ్జాదారుల కన్నుపడి మాయమవుతున్నాయి. రోడ్లదీ అదే పరిస్థితి. కొత్త లేఅవుట్లు, నిర్మాణాలకు అనుమతులిచ్చేముందు ఏముందో చూడకుండానే ముడుపులందుకొని హెచ్‌ఎండీఏ, పురపాలకశాఖ అనుమతులిస్తోండటంతో అక్రమార్కులు అంతకంతకూ ఖాళీ జాగాల్ని ఆక్రమించేసుకుంటున్నారు.

ఎన్నో ఫిర్యాదులు చేశాం..: డాక్టర్‌ అవినాష్‌, తిరుమలహిల్స్‌ కాలనీ సంఘం అధ్యక్షులు  
మూడేళ్లుగా పార్కును కాపాడాలని మున్సిపల్‌ కమిషనర్‌తో సహా అందరికీ ఫిర్యాదులిచ్చినా ఎవరూ స్పందించలేదు. భవిష్యత్తు తరాలకు ఆ పార్కు మిగల్చాలనే మేం పోరాటం చేస్తున్నాం.  


కేరాఫ్‌ మణికొండ..!

ణికొండ మున్సిపాలిటీ పరిధిలో గత రెండేళ్ల కాలంలో అక్రమ లేఅవుట్ల అనుమతులపై పెద్దఎత్తున ఫిర్యాదులొస్తున్నాయి. ఇక్కడ నాలుగైదు కాలనీల్లో పార్కులు, రోడ్లనూ వదలకుండా కొందరు లేఅవుట్లు సృష్టించారు. వీటిలోనే టౌన్‌ప్లానింగ్‌ విభాగం భవన నిర్మాణాలకు అనుమతులిచ్చింది. ఇలాంటి ఆరోపణల మీదే టౌన్‌ ప్లానింగ్‌ అధికారి ఇటీవలె సస్పెండ్‌ అవడం గమనార్హం. రెండు నెలలుగా ఆ కుర్చీ ఖాళీగా ఉంది.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని