మ్యూజియం కళాఖండాల వీక్షణకు యాప్‌
eenadu telugu news
Published : 19/10/2021 03:17 IST

మ్యూజియం కళాఖండాల వీక్షణకు యాప్‌

యాప్‌ను ప్రారంభిస్తున్న జయేష్‌ రంజన్‌, డాక్టర్‌ నాగేందర్‌రెడ్డి

చార్మినార్‌, న్యూస్‌టుడే: సాలార్‌జంగ్‌ మ్యూజియంలోని కళాఖండాలను ఇకపై ‘మ్యూజియం ఆడియో గైడ్‌’ యాప్‌ ద్వారా వీక్షిస్తూ.. వాటి వివరాలూ తెలుసుకోవచ్చు. సందర్శకుల సౌకర్యార్థం సోమవారం సాయంత్రం నుంచి ఈ అవకాశం అందుబాటులోకి వచ్చింది. ఇక్కడి 39 గ్యాలరీల్లోని 46 వేల కళాఖండాలను యాప్‌తో అనుసంధానం చేశారు. యాప్‌ను మ్యూజియం డైరెక్టర్‌ డాక్టర్‌ అబ్బారెడ్డి నాగేందర్‌రెడ్డి, నిజాం వారసుడు రౌనాక్‌ యార్‌ఖాన్‌తో కలిసి రాష్ట్ర ఐటీ ప్రధాన కార్యదర్శి జయేష్‌ రంజన్‌ లాంఛనంగా ప్రారంభించారు. జయేష్‌ రంజన్‌ మాట్లాడుతూ.. ఈ యాప్‌ సందర్శకులకు గైడ్‌ మాదిరి ఉపకరిస్తుందన్నారు. డా.నాగేందర్‌రెడ్డి మాట్లాడుతూ.. కళాఖండాల వివరాలు తెలుసుకోవడానికి సందర్శకులు అదనంగా మరో టికెట్‌ తీసుకోవాలని, సిబ్బంది ఇచ్చే క్యూఆర్‌కోడ్‌ను గ్యాలరీ ముందే స్కాన్‌ చేయాలని సూచించారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని