Suicide: పొలం అమ్ముతానన్నందుకు కుమారుడి ఆత్మహత్య
eenadu telugu news
Updated : 19/10/2021 08:13 IST

Suicide: పొలం అమ్ముతానన్నందుకు కుమారుడి ఆత్మహత్య

గోవర్ధన్‌రెడ్డి

షాద్‌నగర్‌ పట్టణం, న్యూస్‌టుడే: పొలం విషయంలో తండ్రితో జరిగిన వివాదంతో కుమారుడు ఆత్మహత్య చేసుకున్నాడు. షాద్‌నగర్‌ మండల పరిధిలోని చిల్కమర్రి సమీపంలో ఈ ఘటన సోమవారం వెలుగు చూసింది. శంకర్‌పల్లి మండలం చెన్నారెడ్డిగూడకు చెందిన రాంరెడ్డికి ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. కుమారుడు గోవర్ధన్‌రెడ్డి(36) మస్కట్‌లో ఉద్యోగం చేస్తున్నాడు. నెల రోజుల క్రితం గ్రామానికి వచ్చాడు. వారికి 10 ఎకరాలు పొలం ఉంది. విలువ సుమారు రూ.30 కోట్లు ఉంటుంది. తండ్రి రాంరెడ్డి గ్రామంలో ఉన్న కొంత పొలాన్ని అమ్ముతానన్నాడు. గోవర్ధన్‌రెడ్డి వద్దన్నాడు. ఈ విషయమై ఇరువురి ఆదివారం మధ్య చిన్న వివాదం జరిగింది. హైదరాబాద్‌ వెళ్తున్నానని చెప్పిన గోవర్ధన్‌రెడ్డి రాత్రికి ఇంటికి చేరుకోలేదు. చిల్కమర్రి శివార్లలోని రైలు పట్టాలపై అతడి మృతదేహం కనిపించింది. అతడికి భార్య, ఇద్దరు చిన్న పిల్లలున్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని