విద్యార్థి తల పగులగొట్టిన ఉపాధ్యాయురాలు
eenadu telugu news
Published : 19/10/2021 03:17 IST

విద్యార్థి తల పగులగొట్టిన ఉపాధ్యాయురాలు

గాయపడిన తేజు

కూకట్‌పల్లి, న్యూస్‌టుడే: కూకట్‌పల్లి ప్రకాష్‌నగర్‌లోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఓ ఉపాధ్యాయురాలు ఆవేశంతో విద్యార్థి తలపై కర్రతో కొట్టడంతో తల పగిలి రక్తం కారింది. నాలుగో తరగతి చదువుతున్న తేజు సోమవారం మధ్యాహ్నం అల్లరి చేస్తున్నారంటూ ఉపాధ్యాయురాలు రాజకుమారి అక్కడే ఉన్న కర్రతో బాలుడి తలపై గట్టిగా కొట్టడంతో గాయమైన తల పట్టుకుని ఏడ్చుకుంటూ ఇంటికెళ్లాడు. వెంటనే బాలుడిని ఆసుపత్రికి తీసుకెళ్లగా మూడు కుట్లు వేశారు. తల్లిదండ్రులు ఉపాధ్యాయురాలి తీరుపై తీవ్రంగా మండిపడ్డారు. విషయం తెలుసుకున్న ఎంఈవో ఆంజనేయులు, కార్పొరేటర్‌ జూపల్లి సత్యనారాయణ పాఠశాలకు చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. ఉపాధ్యాయురాలిని సెలవుపై పంపామని, వేరే ఉపాధ్యాయురాలిని నియమిస్తామని ఎంఈవో వివరించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని