కరోనా సైనికులకు పాద పూజ
eenadu telugu news
Published : 21/10/2021 01:01 IST

కరోనా సైనికులకు పాద పూజ

బషీరాబాద్‌, న్యూస్‌టుడే: కరోనా కష్టాల్లో అండగా నిలిచి రోగులకు సేవలందించిన వారికి బషీరాబాద్‌ మండలం దామర్‌చేడ్‌ భవానీ మాత ఆలయంలో పీఠాధిపతి శంకర్‌స్వామిజీ ఆధ్వర్యంలో పాదపూజ నిర్వహించారు. బుధవారం జరిగిన ఈ కార్యక్రమంలో నవల్గా, బషీరాబాద్‌ ఆస్పత్రుల స్టాఫ్‌ నర్సులు, ఏఎన్‌ఎంలు, బషీరాబాద్‌ ఠాణా పోలీసులు, అన్ని గ్రామాల పారిశుద్ధ్య కార్మికులు, సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులకు పాద పూజ చేసి సన్మానం చేశారు. తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలకు చెందిన 600 మంది ముత్తయిదువులకు అమ్మవారి చీరలను అందజేశారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని