ఇది పశువైద్య కేంద్రం... నమ్మాలి మరి
eenadu telugu news
Published : 21/10/2021 01:01 IST

ఇది పశువైద్య కేంద్రం... నమ్మాలి మరి

మండలంలోని మూడు గ్రామాల్లోని పశువైద్య కేంద్రాలు మూత పడటంతో పశుపోషకులు అవస్థలు పడుతున్నారు. మండలంలోని తుంకిమెట్ల, రేగడిమైలారం, గౌరారం కేంద్రాల్లో సిబ్బంది లేకపోవటంతో అక్కడి పోషకులు వైద్యానికి ఇతర ప్రాంతాలకు పరుగులు పెట్టాల్సి వస్తోందని పలువురు తెలిపారు. అంతేకాదు పట్టించుకునే వారు లేక తుంకిమెట్ల పశువైద్య కేంద్ర పరిసరాలు అధ్వానంగా మారాయన్నారు. దూర ప్రాంతాలకు మేకలు, గొర్రెలు, పశువులను వైద్యానికి తీసుకెళ్లలేమని ఉన్నతాధికారులు చర్యలు తీసుకొని సిబ్బందిని నియమించాలని ఆయా గ్రామాల పోషకులు కోరుతున్నారు.

- న్యూస్‌టుడే, బొంరాస్‌పేట


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని