ఈ పండగంతా ఇంట్లోనే!
eenadu telugu news
Published : 21/10/2021 01:15 IST

ఈ పండగంతా ఇంట్లోనే!

ఈనాడు డిజిటల్‌, హైదరాబాద్‌: కొవిడ్‌ ఇంకా పోలేదు.. అది మిగిల్చిన కష్టనష్టాలూ తీరలేదు.. ఇంతలో మళ్లీ పండగొచ్చింది. ఈ వేళ తప్పనిసరి దుస్తులు, ఇంటి సామాన్లు, ఇతర విద్యుత్తు ఉపకరణాలు కొనాల్సిన వారిలో ఎక్కువ మంది ఆన్‌లైన్‌ దుకాణాల వైపే అడుగులేస్తున్నారు. హైదరాబాద్‌ పరిధిలో అన్ని ఈ కామర్స్‌ సైట్లలో కలిపి రోజూ కనీసం 2 లక్షల డెలివరీలు జరుగుతుండగా.. పండగ సమయంలో రోజూ 4 లక్షలకు ఈ సంఖ్య పెరిగింది. పండగల వేళ ఈ కామర్స్‌ సంస్థలు ప్రకటించిన రాయితీలతో నగరంలోని షాపింగ్‌ ప్రియులు వీటిపైనే ఆధారపడుతున్నారు.

 

సామర్థ్యం పెంచుకొని.. పండగ సీజన్‌లో డెలివరీల కోసం ఫ్లిప్‌కార్ట్‌ సంస్థ ఏకంగా 2 వేలకు పైగా కొత్త విద్యుత్తు వాహనాల్ని రంగంలోకి దించింది. హైదరాబాద్‌తో పాటు మరిన్ని నగరాల్లోనూ ఈ వాహనాలను డెలివరీకి వాడుతున్నట్లు సంస్థ ప్రతినిధి తెలిపారు.

ఇన్‌స్టా ట్రెండ్‌.. పండగ వేళ మహిళలు, యువతుల్లో ఎక్కువ మంది చీరలు, విభిన్న దుస్తుల కోసం ఇన్‌స్టా పేజీలనే నమ్ముకొన్నారు. మోడళ్ల ఎంపిక నుంచి డెలివరీ దాకా అంతా సంస్థలే చూస్తుండటంతోపాటు ప్రస్తుత ట్రెండ్‌కి తగ్గ దుస్తుల కోసం సామాజిక మాధ్యమాల్నే వాడుకోవడం గమనార్హం.

కేటుగాళ్లకు అదను

పెరిగిన ఆన్‌లైన్‌ కొనుగోళ్లే ఆసరాగా సైబర్‌ కేటుగాళ్లు నకిలీ యాప్‌లు, షాపింగ్‌ సైట్లతో వినియోగదారులను బురిడీ కొట్టించారు. ప్రధాన ఈ-కామర్స్‌ సైట్‌ని పోలిన సైట్లే కొన్ని ఉండగా, కొన్ని వస్తువులపై భారీ రాయితీలంటూ డబ్బు చెల్లించుకొని ఆ తర్వాత వస్తువులు పంపనివి ఉన్నాయి. సామాజిక మాధ్యమాల వేదికగా కొనుగోళ్లు చేసిన సైట్లలోనే ఎక్కువ మోసాలు జరగడం గమనార్హం.

ఏడాది ఈ-కామర్స్‌ కొనుగోళ్లు (అక్టోబరు 20వరకు)

2019

45%

2021

27%

హైదరాబాద్‌లో కొవిడ్‌ తర్వాత దాదాపు 60% మంది చిన్నచిన్న నిత్యావసరాలకూ ఈ-కామర్స్‌ సైట్లపై ఆధారపడతున్నారని ఓ అధ్యయనం వెల్లడించింది. ఇందులో 54 శాతం మహిళలు, 46 శాతం మంది పురుషులున్నారని.. నగరంలో ప్రతి మంగళవారం, బుధవారాల్లో రెట్టింపు షాపింగ్‌ జరుగుతోందని తేల్చింది.

చిన్న చిన్న వాటికీ..

51%

2020


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని