చేవెళ్లతో విడదీయరాని అనుబంధం
eenadu telugu news
Published : 21/10/2021 03:49 IST

చేవెళ్లతో విడదీయరాని అనుబంధం

ప్రజా ప్రస్థానం ప్రారంభంలో విజయమ్మ, షర్మిల

కార్యకర్తలు బహూకరించిన కరవాలంతో షర్మిల

చేవెళ్ల, న్యూస్‌టుడే: దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డికి చేవెళ్లతో విడదీయరాని అనుబంధం ఉండేదని వైఎస్‌ఆర్‌ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల, వైఎస్‌ సతీమణి విజయమ్మ గుర్తు చేసుకున్నారు. వైఎస్‌ షర్మిల ప్రజా ప్రస్థానం పేరిట చేపట్టిన సుదీర్ఘ పాదయాత్రకు బుధవారం చేవెళ్ల నుంచి శ్రీకారం చుట్టిన సందర్భంగా ఏర్పాటు చేసిన సభకు ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నుంచే కాకుండా రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల నుంచి కార్యకర్తలు, వైఎస్‌ అభిమానులు తరలివచ్చారు. సభా స్థలికి తల్లి విజయమ్మతో కలిసి వచ్చిన షర్మిలకు శ్రేణులు ఘనంగా స్వాగతం పలికాయి. బీజాపూర్‌ జాతీయ రహదారికి ఆనుకుని వికారాబాద్‌ రోడ్డు పక్కన బహిరంగ సభ ఏర్పాటు చేశారు. వేదికపై ఏర్పాటు చేసిన వైఎస్‌ఆర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం సర్వమత ప్రార్థనలు చేసి సభను ప్రారంభించారు. ఈ సందర్భంగా విజయమ్మ సుదీర్ఘంగా మాట్లాడారు. వైఎస్‌ చేవెళ్ల నుంచే ప్రజాప్రస్థానం పాదయాత్ర చేపట్టారని.. ముఖ్యమంత్రి పదవి చేపట్టాక ఏ సంక్షేమ పథకమైనా ఇక్కడి నుంచే ప్రారంభించేవారని గుర్తు చేశారు. పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, పార్లమెంటు కన్వీనర్‌ కొండా రాఘవరెడ్డి మాట్లాడుతూ రాజన్న రాజ్యం తేవాలన్నదే యాత్ర ముఖ్య ఉద్దేశమన్నారు. మరో అధికార ప్రతినిధి తూటి దేవేందర్‌రెడ్డి, పిట్టరాంరెడ్డి, గాయకుడు ఏపూరి సోమన్న మాట్లాడారు.

కందవాడ వరకు
సభ ముగిసిన తర్వాత ఆమె అక్కడి నుంచి కార్యకర్తలు, వైఎస్‌ అభిమానులతో కలిసి పాదయాత్రగా బయల్దేరారు. స్థానిక షాబాద్‌ చౌరస్తాలో ఉన్న వైఎస్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. విద్యా వికాస్‌ ఇంజినీరింగ్‌ కళాశాల సమీపంలో మధ్యాహ్న భోజనం చేసి విశ్రాంతి తీసుకున్నారు. సాయంత్రం అక్కడి నుంచి కందవాడకు  చేరుకున్నారు.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని