పసిడి పతకం ఒడిసి పట్టి..
eenadu telugu news
Published : 21/10/2021 03:49 IST

పసిడి పతకం ఒడిసి పట్టి..

విద్యార్థినికి బంగారు పతకం అందజేస్తున్న సాంకేతిక శాఖ విద్యా కమిషనర్‌ నవీన్‌ మిత్తల్‌, ప్రొ.రవీందర్‌ తదితరులు

ఉస్మానియా యూనివర్సిటీ, న్యూస్‌టుడే: ఉస్మానియా యూనివర్సిటీ ఇంజినీరింగ్‌ కళాశాల అకడమిక్‌ అవార్డుల ప్రదానోత్సవం బుధవారం ఘనంగా నిర్వహించారు. ఓయూ ఇంజినీరింగ్‌ కళాశాలలో నిర్వహించిన కార్యక్రమంలో 2017-18, 2018-19, 2019-20 అకడమిక్‌ సంవత్సరాలకు సంబంధించి బంగారు పతకాలు ప్రదానం చేశారు. కరోనా కారణంగా రెండేళ్లుగా ఈ కార్యక్రమం నిర్వహించలేదు. మూడు సంవత్సరాలకుగాను 70 బంగారు పతకాలు, 9 నగదు పురస్కారాలను అందజేశారు. ఇంజినీరింగ్‌ కళాశాల ప్రిన్సిపల్‌ ప్రొ.కుమార్‌ అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సాంకేతిక విద్యాశాఖ కమిషనర్‌ నవీన్‌ మిత్తల్‌, ఓయూ ఉపకులపతి ప్రొ.రవీందర్‌, రిజిస్ట్రార్‌ ప్రొ.లక్ష్మినారాయణ హాజరయ్యారు. ప్రముఖ వ్యాపారవేత్త, ఓయూ ఇంజినీరింగ్‌ కళాశాల పూర్వ విద్యార్థి చల్లా రాజేంద్రప్రసాద్‌కు లైఫ్‌టైం అచీవ్‌మెంట్‌ అవార్డును ప్రదానం చేశారు.

 


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని