‘రాజధానిలో గంజాయి వాసనఉండరాదు’
eenadu telugu news
Published : 21/10/2021 03:49 IST

‘రాజధానిలో గంజాయి వాసనఉండరాదు’

ఈనాడు, హైదరాబాద్‌: రాజధానికి గంజాయి వాసన సోకకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని హైదరాబాద్‌, సైబరాబాద్‌, రాచకొండ పోలీస్‌ కమిషనర్లు అంజనీకుమార్‌, మహేష్‌ భగవత్‌, స్టీఫెన్‌ రవీంద్రను సీఎం కేసీఆర్‌ ఆదేశించారు. రాష్ట్రంలో మాదక ద్రవ్యాలను నిరోధించేందుకు బుధవారం సీఎం ప్రగతి భవన్‌లో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. గుడుంబా తయారీ, వినియోగాన్ని నిర్మూలించామని, భవిష్యత్తులో రాజధానిలో గంజాయి లభించకుండా పటిష్ఠ చర్యలు చేపట్టాలని సూచించారు. ఇతర రాష్ట్రాలు, జిల్లాల నుంచే ఇక్కడకు వస్తున్నందున రవాణాపై దృష్టి కేంద్రీకరించి సరఫరాదారులను అరెస్ట్‌ చేయాలన్నారు. గంజాయి నిర్మూలనకు ఆరు వారాల నుంచి నిర్వహిస్తున్న ప్రత్యేక డ్రైవ్‌ కొనసాగించాలని సీఎం ఆదేశించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని