టైగర్‌ కప్‌ విజేత జెమిని ఫ్రెండ్స్‌
eenadu telugu news
Published : 21/10/2021 03:49 IST

టైగర్‌ కప్‌ విజేత జెమిని ఫ్రెండ్స్‌

గెలిచిన జట్టుతో మహమ్మద్‌ అజహరుద్దీన్‌

ఈనాడు డిజిటల్‌, హైదరాబాద్‌: ఎమ్‌ఏకే పటౌడీ టైగర్‌ కప్‌ టీ20 టోర్నీ ఆరంభ సీజన్‌లో జెమిని ఫ్రెండ్స్‌ సీసీ విజేతగా నిలిచింది. బుధవారం ఉప్పల్‌లో జరిగిన ఫైనల్లో 48 పరుగుల తేడాతో డెక్కన్‌ క్రానికల్‌ సీసీపై విజయం సాధించింది. మొదట జెమిని ఫ్రెండ్స్‌ 20 ఓవర్లలో 5 వికెట్లకు 147 పరుగులు చేసింది. ప్రజ్ఞయ్‌రెడ్డి(42), కమల్‌(38), తిలక్‌వర్మ(26) రాణించారు. ఛేదనలో డెక్కన్‌ క్రానికల్‌ 17 ఓవర్లలో 99 పరుగులకే కుప్పకూలింది. రిషిత్‌రెడ్డి(4/16) ఆ జట్టు పతనాన్ని శాసించాడు. హెచ్‌సీఏ అధ్యక్షుడు మహమ్మద్‌ అజహరుద్దీన్‌ విజేతలకు ట్రోఫీలు అందజేశారు.


 


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని