తాండూరు కర్మాగారాన్ని మరింత అభివృద్ధి చేస్తాం
eenadu telugu news
Published : 22/10/2021 00:47 IST

తాండూరు కర్మాగారాన్ని మరింత అభివృద్ధి చేస్తాం

సీసీఐ సీఎండీ సంజయ బంగా

తాండూరుగ్రామీణ, న్యూస్‌టుడే: కరోనా ప్రభావంతో సిమెంటు కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా(సీసీఐ) కర్మాగారంలో కొత్త నియామకాలపై కేంద్ర ప్రభుత్వం విధించిన నిషేధాన్ని ఎత్తివేయించేందుకు కృషి చేస్తామని సీఎండీ సంజయ్‌బంగా వెల్లడించారు. గురువారం దిల్లీ నుంచి తాండూరు వచ్చిన ఆయన కరణ్‌కోటలోని సీసీఐ కర్మాగారాన్ని సందర్శించారు. ఉత్పత్తి, లోడింగ్‌ విభాగాలతోపాటు మైనింగ్‌ ప్రాంతాన్ని పరిశీలించారు. అనంతరం సీసీఐ టౌన్‌షిప్‌లోని అతిథిగృహంలో విలేకరులతో మాట్లాడారు. ఖాళీల భర్తీ విషయమై త్వరలో సంబంధిత కేంద్ర మంత్రులతో చర్చిస్తానని చెప్పారు. ఉద్యోగులు, కార్మికుల పేరివిజన్‌ బకాయిలపై అధ్యయనం చేసి త్వరలో చెల్లించేందుకు చర్యలు చేపడతామన్నారు. స్థానిక ఫ్యాక్టరీకి అందుబాటులో ఉన్న అన్నివనరులను పూర్తి స్థాయిలో వినియోగించుకొని మరింత అభివృద్ధి చేస్తామని ఆయన వివరించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 10 లక్షల మెట్రిక్‌ టన్నుల ఉత్పత్తి లక్ష్యాన్ని సాధించేందుకు ప్రయత్నిస్తామన్నారు. తొలిసారిగా తాండూరు వచ్చిన సీఎండీకి జీఎం వివేక్‌కుమార్‌, మేనేజర్‌ అమిత్‌రంజన్‌ ఆధ్వర్యంలో ఘనస్వాగతం పలికారు. అన్ని విభాగాధిపతులతో వేర్వేరుగా సమీక్షా సమావేశం నిర్వహించిన సీఎండీ ఉత్పత్తులు, ఎగుమతులు, ముడిసరుకు నిల్వలు, ఉత్పత్తి సామర్థ్యం పెంపుపై చర్చించారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని