హరితం.. చేరని లక్ష్యం
eenadu telugu news
Published : 22/10/2021 00:47 IST

హరితం.. చేరని లక్ష్యం

పచ్చందాల పెంపునకు ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన హరితహారం లక్ష్యం తాండూరు పట్టణంలో నెరవేరడంలేదు. ఈ ఏడాది పట్టణ వ్యాప్తంగా 36 వార్డుల్లో 40 వేల మొక్కలు నాటాలని అధికారులు కార్యాచరణ రూపొందించారు. విశ్వంభర కాలనీ, విజయనగర్‌ కాలనీ, పురపాలక సంఘం నూతన భవనం ఆవరణలో.. ప్రధాన రోడ్లు, వీధులు, కాలనీలు, విద్యా సంస్థలు, ప్రభుత్వ కార్యాలయాల్లో నాటినా, సగం కూడా పూర్తి చేయలేకపోయారు. ఇంకా నాటాల్సిన మొక్కలు పురపాలక సంఘం కార్యాలయంలోనే ఉన్నాయి.

- న్యూస్‌టుడే, తాండూరు టౌన్‌


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని