హనుమాన్‌ ఆలయ నిర్మాణానికి ముస్లిం సోదరుల భారీ విరాళం
eenadu telugu news
Published : 22/10/2021 00:47 IST

హనుమాన్‌ ఆలయ నిర్మాణానికి ముస్లిం సోదరుల భారీ విరాళం

మర్పల్లి, న్యూస్‌టుడే: మండలంలోని పట్లూర్‌ గ్రామంలో హనుమాన్‌ దేవాలయ నిర్మాణానికి ముస్లిం సోదరులు గురువారం భారీగా విరాళాలు ఇచ్చారు. హైదరాబాద్‌కు చెందిన మాజీ కార్పొరేటర్‌ షఫీ రూ.1,16,000, మహ్మద్‌ జాకీర్‌ రూ.50,000, రషీద్‌ ఖాద్రీ రూ.51,000, హజీజ్‌ రూ.11,000 దేవాలయ కమిటీ ఛైర్మన్‌ అశోక్‌ తదితరుల సమక్షంలో అందించారు. ఇప్పటి వరకు మొత్తం రూ.60 లక్షలు వసూలైనట్లు కమిటీ సభ్యులు పేర్కొన్నారు. ముస్లి సోదరులు పెద్ద మొత్తం విరాళాలు ఇవ్వడంపై స్థానికులు సంతోషం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో గ్రామ పెద్ద సురేష్‌, వార్డు సభ్యులు లాలయ్య, ప్రభు, శ్రీశైలం, శంకరయ్య, బాబురావు, అశోక్‌, లక్ష్యయ్య, లాలయ్య, గోపాల్‌ తదితరులు ఉన్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని